క్యాన్సర్‌తో కన్నుమూసిన బుల్లితెర నటుడు విభు రాఘవ్‌

Telugu Lo Computer
0


బుల్లితెర నటుడు విభు రాఘవ్‌ క్యాన్సర్‌తో  కన్నుమూశాడు. పెద్దపేగు క్యాన్సర్‌తో పోరాడి అలిసిపోయిన అతడు ముంబైలోని ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు. ఆరువారాల క్రితం తన అనారోగ్యం గురించి అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో క్లిప్‌ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనవరిలో కీమోథెరపీ మొదలుపెట్టాం. నాలుగు రౌండ్లయ్యాక ఓ స్కాన్‌ చేశారు. అప్పుడు తెలిసిందేంటంటే నాకు ఇస్తున్న ట్రీట్‌మెంట్‌ ఏమాత్రం పనిచేయడం లేదు. క్యాన్సర్‌ నియంత్రణలో ఉండటం కాదుకదా ఏకంగా శరీరమంతా వ్యాపిస్తోంది. ఇప్పుడు వేరే చికిత్స మొదలుపెట్టారు. ఏం జరుగుతుందో చూడాలి. నాకు మీ ప్రేమాభిమానాలు కావాలి. అదొక్కటే నేను మీనుంచి ఆశించేది అని చిరునవ్వుతో వీడియో ముగించాడు. ఇది చూసిన అభిమానులు, సెలబ్రిటీలు.. నీ పెదాలపై ఆ నవ్వు అలాగే ఉండాలి.. నీకంతా మంచే జరుగుతుంది, ఈసారైనా ట్రీట్‌మెంట్‌ విజయవంతం కావాలి అని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెట్టారు. విభు అసలు పేరు వైభవ్‌ కుమార్‌ సింగ్‌ రాఘవ్‌. నిషా ఔర్‌ ఉస్కే కజిన్స్‌, సావధాన్‌ ఇండియా ఇలాంటి పలు షోలలో కనిపించాడు. 2022లో పెద్దపేగు క్యాన్సర్‌ బారిన పడ్డాడు. ఈ మధ్యే అతడి పరిస్థితి విషమించడంతో సెలబ్రిటీలు అతడి చికిత్స కోసం ఆర్థిక సాయం చేయమని అర్థించారు. గతవారం సైతం నటి సింపుల్‌ కౌల్‌ విభును కాపాడుకుందామంటూ తోచినంత సాయం చేయమని అభిమానులను కోరింది. కానీ ఇంతలోనే విభు ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)