ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. ఈ హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో ఏడుగురు ఉండగా పైలట్‌తో సహా అందరూ మృతిచెందారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు.. సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.వీరంతా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు. హెలికాప్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా 'రుద్రప్రయాగ జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలిసింది. ఇది చాలా విచారకరం. ఎస్డీఆర్ఎఫ్ , స్థానిక పరిపాలన, ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రయాణికులందరి భద్రత కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చారు.
ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి
June 15, 2025
0
Tags