భార్య ఆమె ప్రియుడి వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన భర్త

Telugu Lo Computer
0


ర్యానా లోని రోహ్‌తక్ ప్రాంతానికి చెందిన మగన్ అలియాస్ అజయ్ అనే యువకుడు తన భార్య ఆమె ప్రియుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మగన్ భార్య దివ్య, దీపక్ అనే పోలీస్ అధికారితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా, దీపక్‌తో సన్నిహితంగా ఉన్న వీడియోను భర్తకు పంపి తీవ్రంగా వేధించినట్లు సమాచారం. ఈ వేధింపులు తాళలేక మగన్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో మగన్ మాట్లాడుతూ దివ్య, ఆమె ప్రియుడు కలిసి నా తండ్రిని చంపి, ఆస్తి అమ్మేసి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవలే తన బ్రేస్‌లెట్, సాగుచేసిన ధాన్యం అమ్మి వారికి రూ. 3.5 లక్షలు ఇచ్చానని, ఇప్పుడు మరో రూ. 1.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ విషయంపై లాయర్‌ను కలిసానని, అయితే అమ్మాయిల పట్ల కనికరం ఉంటుందని, ఆమె ఒకసారి ఏడిస్తే ఎవరైనా క్షమిస్తారని లాయర్ చెప్పారని మగన్ ఆవేదనతో తెలిపాడు. దీంతో మగవారిని కాపాడటానికి కూడా చట్టాలు తీసుకురావాలని బాధితుడు వేడుకున్నాడు. చనిపోయిన తర్వాత తన కుమారుడు తన తల్లిదండ్రుల వద్దనే ఉండాలని కోరుతూ మగన్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో, దివ్య మరియు ఆమె ప్రియుడిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)