హైకోర్టులో వైఎస్ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో చిలీ సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారిస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ ఏ2గా ఉన్నారు. వైఎస్ జగన్‌ రెంటపాళ్ల పర్యటనలో వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. సింగయ్య మృతిపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్‌ రమణా రెడ్డి, పీఏ నాగేశ్వర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని కూడా నిందితులుగా చేర్చారు. దాంతో అందరూ ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు వేశారు. అన్ని పిటిషన్లపై రేపు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)