ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మాడ్ డివిజన్ సీనియర్ కేడర్ అబూజ్‌మడ్‌ అడవుల్లో ఉన్నారన్న సమాచారంతో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) నారాయణపుర్, కొండగావ్ ఎస్టీఎఫ్(స్టేట్ టాస్క్ ఫోర్స్) సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. బుధవారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒక ఇన్సాస్ రైఫిల్, ఆయుధంతో పాటు వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)