తిరుమల ఆలయంపై విమానం చక్కర్లు

Telugu Lo Computer
0


రోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో తిరుమల శ్రీవారి ఆలయం పై నుండి విమానం వెళ్ళింది. ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా పలుమార్లు ఆలయం పై విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని చాలాకాలంగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ టీటీడీ విజ్ఞప్తిని కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవడం లేదు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈరోజు ఉదయం స్వామి వారి ఆలయ గోపురం పై నుంచి అతి తక్కువ ఎత్తులోనే విమానం చక్కర్లు కొట్టింది. కొందరు భక్తులు ఇది గమనించి తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ విషయాన్ని కొందరు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆలయం మీదుగా వెళ్లిన విమానం ఎక్కడినుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుంది అన్నది ఆరా తీస్తున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. గతంలో ఇటువంటి ఘటనలు జరిగిన సమయంలో భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అందుకు తగినట్టుగా టిటిడి స్పందించింది. కేంద్ర విమాన యాన శాఖకు తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఇక భక్తులు సైతం తిరుమల భద్రతపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క పదే పదే కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ మళ్ళీ అదే తప్పు జరుగుతూనే ఉంది. తిరుమల ఆలయం పైన విమానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఒకవైపు తిరుమల శ్రీవారి ఆలయం ఉగ్రవాదుల హిట్ లిస్టు లో ఉందని, తెలిసి కూడా దీని భద్రత కోసం కేంద్రం స్పందించకపోవటం కాస్త ఆందోళన కలిగిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)