షావోమి కొన్ని ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఇవ్వబోమని అధికారికంగా ప్రకటించింది. ఎవరైనా ఆ ఫోన్లను వాడుతున్నట్లయితే ఇకమీదట ఏ ఆండ్రాయిడ్ వర్షన్, HyperOS అప్డేట్, సెక్యూరిటీ ప్యాచ్‌లు కూడా రాకపోవచ్చు. షావోమి సాధారణంగా తన ఫోన్లకు 2 లేదా 3 ఏళ్ల వరకూ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇస్తుంది. కొన్ని ప్రీమియం ఫోన్లకు కొన్ని నెలలు అదనంగా వచ్చినా, అది పెద్ద విషయంగా పరిగణించాల్సిన అవసరం లేదు. Xiaomi Mi 11 Ultra, Xiaomi Mi 11X Pro, Xiaomi Mi 11i, Xiaomi Civi 1S, Redmi K50 Pro, Redmi K50, Redmi K40 Pro+, Redmi K40 Pro, Redmi Note 11 Pro, Redmi 10 (2022), POCO F4 GT. ఈ జాబితాలో ఉన్న ఫోన్లు కాల్ చేయడం, యాప్స్ వాడకం, ఫోటోలు తీయడం వంటి రోజూ చేసే పనులు అన్ని పని చేస్తాయి. కానీ.. ఇకపై కొత్త ఫీచర్లు, సెక్యూరిటీ ఫిక్స్‌లు, లేదా HyperOS అప్‌గ్రేడ్‌లు రాకపోవడం అనేది ముఖ్యమైన విషయం. ఉదాహరణకి, POCO F4 GT 2022లో ఆండ్రాయిడ్ 12తో వచ్చింది. తరువాత Android 13, Android 14, HyperOS 2.0 అప్డేట్లు కూడా పొందింది. కానీ 2025లోకి వచ్చేసరికి ఈ ఫోన్ EOL జాబితాలోకి చేరింది. ఇకపై ఈ ఫోన్‌కు ఏమీ కొత్త అప్డేట్లు రావు.
అప్డేట్లు ఆపేసిన షావోమి ?
June 01, 2025
0
Tags