ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మామండూరు దగ్గర హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థి దుర్మరణం చెందాడు. రైలు దిగి ఫ్లాట్ ఫార్మ్ కు వెళ్లే సమయంలో ఘటన చోటుచేసుకుంది. ఫ్లాట్ ఫార్మ్ పై నుంచి కాకుండా రైలు పైకి ఎక్కడంతో విద్యార్థి ప్రమాదానికి గురయ్యాడు. రైల్వే అధికారులు ఆ విద్యార్థిని హుటాహుటిన తిరుపతి రుయాకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. మృతి చెందిన విద్యార్థి డైరీ టెక్నాలజీ చదువుతున్న జాకేష్ గా గుర్తించారు. విద్యార్థి రైలు పైకి ఎందుకు ఎక్కాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థి దుర్మరణం
June 01, 2025
0
Tags