నిర్వహణ సమస్యల వల్ల ఎనిమిది ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు

Telugu Lo Computer
0

యిరిండియా నేడు ఎనిమిది సర్వీసులను రద్దు చేసినట్లు  ప్రకటించింది. మెయింటెనెన్స్‌, కార్యాచరణ సమస్యల కారణంగా వీటిని రద్దు చేసినట్లు వెల్లడించింది. నిర్వహణ సమస్యల కారణంగా జులై రెండోవారం వరకు తమ అంతర్జాతీయ విమాన సర్వీసులను 15 శాతం తగ్గించనున్నామని ఎయిరిండియా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 16 అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది. జూన్‌ 21 నుంచి జులై 15 వరకు ఈ సర్వీసుల తగ్గింపు కొనసాగుతుందని విమానయాన సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాల్లోని నగరాలకు వెళ్లే సర్వీసులపై ఈ ప్రభావం పడనుంది. మరోవైపు దిల్లీ-నైరోబి, అమృత్‌సర్‌-లండన్‌, గోవా-లండన్‌ సర్వీసులను వచ్చే నెల 15 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. భారీగా ఉండే బోయింగ్‌ 777 విమానాల్లో మరింతగా తనిఖీలు చేపట్టనుండటం, ఇరాన్‌ గగనతల మూసివేతల కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ప్రభావితమయ్యే ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)