ఆడ వేషంలో చిక్కిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ : సోషల్ మీడియాలో వీడియో వైరల్‌

Telugu Lo Computer
0


రాజస్థాన్‌కు చెందిన దయా శంకర్ మీద 13 క్రిమినల్ కేసులు ఉన్నాయి. బెదిరింపులు, దొంగతనాలు, కొట్లాటలు ఇలా అన్ని రకాలుగా నేరాలకు పాల్పడ్డాడు. పోలీసులు అతడ్ని పట్టుకుందామనుకునే లోపు కనిపించకుండా పోయాడు. చీర కట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. చీరలో ఉన్న తనను ఎవరూ గుర్తుపట్టలేరన్న ధీమాతో వీధులు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. పక్కా ప్లాన్‌తో అతడ్ని జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దయాను స్టేషన్‌కు ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఫిబ్రవరి నెలలో దయా శంకర్ 23 ఏళ్ల ప్రిన్స్ చావ్లా అనే యువకుడిపై తన గ్యాంగుతో దాడికి దిగాడు. అతడ్ని ఆ గ్యాంగు కర్రలు, బాటిళ్లతో చావకొట్టింది. కేసు పెడితే చంపేస్తామని బెదిరించింది. అయినా ప్రిన్స్ భయపడలేదు. దెబ్బల నుంచి కోలుకున్నాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారిపై కేసు పెట్టాడు. ఫిబ్రవరి 23వ తేదీన అతడిపై కేసు నమోదు అయింది. ఇక, అప్పటినుంచి పోలీసులు అతడి కోసం అన్వేషిస్తున్నారు. అతడి ఇంటికి పలు మార్లు వెళ్లారు. అక్కడ అతడు కనిపించలేదు. ఆ ఇంట్లో ఓ మహిళ మాత్రం కనిపించింది. కొన్ని రోజుల తర్వాత పోలీసులకు ఓ సమాచారం అందింది. ఆ సమాచారంతో పోలీసులు షాక్ అయ్యారు. దయా ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో ఉన్న మహిళ విగ్గు పట్టుకుని లాగగా అసలు విషయం బయటపడింది. మహిళ వేషంలో ఉన్నది దయా అని తేలింది. దీనితో పోలీసులు దయా శంకర్ ని అరెస్టు చేశారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)