అమెరికన్ పెర్సిమన్ (ఖర్జూరా) నారింజ రంగులో ఉంటుంది. ఇది తీయగా రుచిగా ఉంటుంది.ఈ పండు పోషకాలతో నిండి ఉన్న పవర్ హౌస్ గా పిలుస్తారు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు, రోగనిరోధక శక్తి పెంచడానికి ఇన్ఫెక్షన్ తో పోరాడడానికి సహకరిస్తుంది. శరీరానికి అవసరమైన ఆక్సిడెంట్లను అందిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. వాపును తగ్గిస్తుంది. అలాగే గుండెను బలంగా తయారు చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ప్రేగు కదలికలు సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. పండులో ఉండే ఫైబర్, మలబద్ధకం తగ్గిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థలో మంచి బాక్టీరియాను పోషించగలదు. నోటిని తాజాగా ఉంచుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ, లుటీన్, జిరాక్సితిన్ వంటి ఇతర కెరోటి నాయిడ్లు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అమెరికన్ ఖర్జూరాలు లభించే విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యంగా ఉంచుటకు సహకరిస్తుంది. ఆర్థరైటిస్ లేదా ఆటో యూనియన్ సమస్యలు ఉన్నవారికి ఇవి బాగా ఉపయోగపడతాయి.
అమెరికన్ పెర్సిమన్ - ఆరోగ్య ప్రయోజనాలు
June 20, 2025
0
Tags