యెజ్‌టుగో బ్రాండ్‌తో తయారైన లెనకాపవిర్ అనే మెడిసిన్ హెచ్‌ఐవీ నుంచి 99.9% రక్షణ అందిస్తున్నదని దాని అభివృద్ధి సంస్థ గిలియడ్ సైన్సెస్ వెల్లడించింది. తమ మెడిసిన్ లెనకాపవిర్‌కు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) ఆమోదం కూడా లభించిందని తెలిపింది. యెజ్‌టుగో బ్రాండ్‌తో లెనకాపవిర్‌గా విడుదలవ్వనున్న ఈ ఔషధం ఆరు నెలకొకసారి చొప్పున ఏడాదికి రెండు ఇంజెక్షన్‌లు తీసుకుంటే హెచ్‌ఐవీ నుంచి 99.9% రక్షణ అందిస్తుందని వివరించింది. గతంలో రోజువారీ మాత్రలు అయిన ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ రోగంపై పరిమిత ప్రభావాన్ని మాత్రమే చూపాయని, కానీలెనకాపవిర్ ఓ వ్యాక్సిన్‌తో సమానమైన ఫలితాలిస్తున్నదని చెప్పింది. పెద్దలు, కౌమారదశలో ఉన్నవారిలో హెఐవీ సంక్రమణ ప్రమాదాన్ని లెనాకాపావిర్ 99.9 శాతానికి పైగా తగ్గిస్తుందని తేలినట్లు స్పష్టం చేసింది. మెడిసిన్ పై రెండు ట్రయల్స్ నిర్వహించామని మొదటిది సబ్-సహారా ఆఫ్రికాలో 2,000 కంటే ఎక్కువ మంది మహిళలతో నిర్వహించామని వివరించింది. దీని ఫలితంగా ఇన్ఫెక్షన్లు వంద శాతం తగ్గాయని చెప్పింది. రెండో ట్రయల్ లో భాగంగా 99.9% నివారణ రేటు నమోదైందని వెల్లడించింది. రోజువారీ మాత్ర అయిన ట్రువాడా కంటే ఉన్నతమైన ఫలితాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన కథనాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లోనూ ప్రచురితమయ్యాయి. లెనకాపవిర్ ను 2024లో సైన్స్ జర్నల్ 'బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్'గా గుర్తించింది. అయితే, ఔషధం ధర రూ. 20.80 లక్షల నుంచి 32.50లక్షలుగా ఉంది. గిలియడ్ సంస్థ ధర తగ్గిస్తే హెచ్‌ఐవీ మహమ్మారిని అంతం చేయడం సాధ్యమని నిపుణులు అంటున్నారు.
హెచ్‌ఐవీని మాయం చేసే లెనకాపవిర్ ఇంజెక్షన్ ?
June 20, 2025
0
Tags