షర్మిల ఫోన్ ను ట్యాపింగ్ చేశారో లేదో తనకు తెలియదు : వైఎస్ జగన్

Telugu Lo Computer
0


తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై జగన్ తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. షర్మిల ఫోన్ ను ట్యాపింగ్ చేశారో లేదో తనకు తెలియదని అన్నారు. గతంలో షర్మిల తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని, తనకు తెలంగాణ వ్యవహారాలతో సంబంధం లేదని తెలిపారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవమేనని, ఆ సమాచారాన్ని కేసీఆర్, జగన్ పంచుకున్నారని షర్మిల ఆరోపించారు. తన ఫోన్‌తో పాటు, తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని అన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారన్నారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తానన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలి. ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందని వైఎస్ షర్మిల అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)