ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పరామర్శ ఉద్దేశం ప్రజలను రెచ్చగొట్టడమే అని కమ్మ సేవా సమితి ప్రతినిధి సూరపనేని స్వరూప రాణి అన్నారు. పోలీసుల సూచనలు పాటించకుండా వందల మందిని పోగు చేసి ప్రజలను పోలీసులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇటువంటి వాటిపై ఏం చేయాలో భవిష్యత్తులో సమావేశాలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెంటపాళ్ల పర్యటనలో 2029లో అధికారంలోకి వస్తే అందరినీ నరుకుతామని ప్లకార్డులు ప్రదర్శించారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సహకారంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీయడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రెంటపాళ్లలో వైసీపీ వ్యవహారశైలిని సీఎం చంద్రబాబు ఖండిస్తే అందులో తప్పేముందని జగన్ మాట్లాడుతున్నారన్నారు. ఇటువంటి వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కమ్మ సామాజికవర్గాన్ని అవమానించకుండా చూడాలనేది కమ్మ వారి సేవా సమాఖ్య ప్రధాన డిమాండ్ అని స్వరూప రాణి చెప్పుకొచ్చారు. 'జగన్మోహన్ రెడ్డి మీ పార్టీలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు కమ్మ వారికి ఇవ్వగలరా?, వైసీపీ ప్రభుత్వంలో కమ్మవారికి ఒక్క మంత్రి పదవి అయినా ఇచ్చారా?. అందరినీ సమానంగా చూడాలి' అని ముత్తవరపు రామకృష్ణ పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి పరామర్శ ఉద్దేశం ప్రజలను రెచ్చగొట్టడమే !
June 20, 2025
0
Tags