బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ 'ప్రజలే నా ఆత్మకథ'ను ఆవిష్కరించిన రామ్‌నాథ్‌ కోవింద్‌

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ 'ప్రజలే నా ఆత్మకథ'ను ఆదివారం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవిష్కరించారు. అనంతరం పుస్తక ప్రతులను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు అందజేశారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత పార్శ్వాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ, ఏపీ, ఒడిశా, త్రిపుర గవర్నర్లు జిష్ణుదేవ్‌ వర్మ, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భాజపా ఎంపీ లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ నేతలు కె.కేశవరావు, వి.హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)