ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవశం చేసుకున్న కోకో గాఫ్‌

Telugu Lo Computer
0


ఫ్రెంచ్ ఓపెన్ 2025 టైటిల్‌ను గెలుచుకున్న కోకో గాఫ్‌ కైవశం  చేసుకుంది. రసవత్తరమైన మ్యాచ్‌లో అమెరికన్ యువ సంచలనం కోకో గాఫ్ ప్రపంచ నంబర్ వన్ అరినా సబలెంకాపై అద్భుతమైన విజయం సాధించి తన మొదటి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ నంబర్ 2 కోకో గాఫ్ ప్రపంచ నంబర్ వన్ అరినా సబలెంకాల మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం నుంచి ఉత్కంఠభరితంగా సాగింది. తొలి సెట్‌ను 7-6 (5) తేడాతో సబలెంకా గెలుచుకోవడంతో, మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది. సబలెంకా తన పవర్‌ఫుల్ షాట్‌లతో గాఫ్‌పై ఒత్తిడి తెచ్చింది. మొదటి సెట్‌లో 4-1తో సబలెంక ఆధిక్యంలోకి వెళ్లినా, కోకో గాఫ్ అద్భుతంగా పుంజుకుని సెట్‌ను టైబ్రేక్ వరకు తీసుకెళ్లింది. అయితే, టైబ్రేక్‌లో సబలెంకా పైచేయి సాధించింది. 21 ఏళ్ల కోకో గాఫ్ తొలి సెట్‌ను కోల్పోయిన తర్వాత కూడా అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించింది. ఆమె తర్వాతి రెండు సెట్లలో సబలెంకాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 6-2, 6-4 తేడాతో గెలుచుకుంది. రెండో సెట్‌లో గాఫ్ మరింత దూకుడుగా ఆడి సబలెంకా సర్వీస్‌ను పలుమార్లు బ్రేక్ చేసి సులువుగా గెలిచింది. నిర్ణయాత్మక మూడో సెట్‌లో కూడా గాఫ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించి కీలక పాయింట్లను సాధించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ మొత్తం 2 గంటల 38 నిమిషాల పాటు జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)