మాగంటిని భౌతికకాయాన్ని చూసి కన్నీరు పెట్టిన కేసీఆర్‌

Telugu Lo Computer
0


జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ భౌతికకాయాన్నికి నివాళి అర్పించేందుకు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెళ్లారు. మాగంటి భౌతికకాయం వద్ద పుచ్చగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. ఈ క్రమంలో కేసీఆర్‌ భావోద్వేగానికి గురైన కన్నీరు పెట్టుకున్నారు. మాగంటి మృతదేహాన్ని చూసి ఆవేదన చెందారు. అనంతరం, మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాగంటి కుమారుడిని అప్యాయంగా దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)