నెక్ట్స్‌వేవ్, ఓపెన్‌ఏఐ అకాడమీ కలిసి దేశీయంగా అతి పెద్ద జెన్‌ఏఐ ఇన్నోవేషన్ బిల్డ్‌థాన్‌కి శ్రీకారం చుట్టాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి. 500 క్యాంపస్‌ల నుంచి 25 వేల మందికి పైగా విద్యార్థులు జెన్ ఏఐ టెక్నాలజీలో నైపుణ్యాలను పెంచుకునేందుకు ఇదొక అవకాశం కాగలదని పేర్కొన్నాయి. మూడు రౌండ్లలో జరిగే ఈ పోటీల్లో విజేతలకు మొత్తం రూ. 10 లక్షల బహుమతితో పాటు ఓపెన్‌ఎఐ వ్యవస్థలో కెరియర్‌ను తీర్చిదిద్దుకునే అవకాశాలు లభిస్తాయి. పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైన టీమ్స్.. రియల్ టైమ్ శిక్షణ, మెంటార్ సపోర్ట్, సరి్టఫికెట్లు మొదలైనవి పొందవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా 2,000కు పైగా ఏఐ ప్రాజెక్టులకు రూపకల్పన జరగవచ్చని నెక్ట్స్‌వేవ్ అంచనా వేస్తోంది.
ఏడు రాష్ట్రాల్లో జెన్‌ఏఐలో పోటీలు : రూ. 10 లక్షలు బహుమతి
June 08, 2025
0
Tags