ఇండియా జట్టుకు కొత్త కోచ్ గా ఆడ్రియన్ లె రూక్స్

Telugu Lo Computer
0


క్షిణాఫ్రికా స్పోర్ట్స్ నిపుణుడు ఆడ్రియన్ లె రూక్స్ మళ్లీ భారత జట్టు కోచ్ ‎గా వచ్చాడు. ఆయన 2002 నుంచి 2003 వరకు కూడా భారత జట్టుకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా సేవలందించాడు. ఇప్పుడు మరోసారి అదే బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటివరకు భారత జట్టుకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా సోహమ్ దేశాయ్ వ్యవహరిస్తున్నారు. అయితే, ఇంగ్లాండ్ టూర్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధాన కారణం ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడం, ఇంగ్లాండ్‌ వాతావరణానికి తగ్గట్టుగా శారీరకంగా వారిని సిద్ధం చేయడమే. భారత జట్టు ఇప్పటికే లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ట్రైనింగ్‌ను ప్రారంభించింది. బీసీసీఐ అందుకు సంబంధించిన సన్నాహకాల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ట్రైనింగ్‌లో ప్రధానంగా ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ పాల్గొన్నారు. వీరితో పాటు నూతన టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్, వికెట్‌కీపర్ రిషభ్ పంత్, ఆల్‌రౌండర్ జడేజా కూడా పాల్గొన్నారు. ఈ టెస్ట్ సిరీస్‎ కు భారత జట్టు హెడ్ కోచ్ ‎గా మాత్రం గౌతమ్ గంభీర్ ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)