తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా నిర్మాత సునీల్ నారం వరుసగా మూడవసారి నిన్న ఎన్నికయ్యారు. అయితే, తాజాగా ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఒక లేఖ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా, ఆయన తనకు సంబంధం లేకుండా తన పేరుతో పబ్లిక్ స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారని ఆరోపించారు. సినీ పరిశ్రమ నుంచి ఏదైనా పబ్లిక్ స్టేట్‌మెంట్ కానీ, ఇంటర్వ్యూ కానీ, ప్రెస్ మీట్ కానీ నిర్వహిస్తే, తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదని వెల్లడించారు. ఈ క్రమంలోనే, ఇకమీదట ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలనుకోవడం లేదని, తన ఇన్వాల్వ్‌మెంట్ లేని విషయాల్లో మాటపడాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా కొనసాగలేనని, తనకు అవగాహన లేకుండా, తన ప్రమేయం లేకుండా ఇచ్చే స్టేట్‌మెంట్‌ల వల్ల తన పేరు పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. కేవలం ఈ కారణంతోనే తాను అధ్యక్షుడిగా రాజీనామా చేస్తున్నానని ఆయన వెల్లడించారు. ఫిల్మ్ ఛాంబర్ తాను ఇచ్చిన ఈ లేఖను రాజీనామాగా పరిగణించాలని ఆయన కోరారు. అలాగే, తన తర్వాత మరొకరిని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా నియమించాలని కూడా కోరారు. గత కొద్ది రోజులుగా ఏషియన్ సునీల్ పేరు అనేక విషయాల్లో వార్తల్లోకి ఎక్కుతోంది. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ సినిమాపై కుట్ర చేసిన ఆ నలుగురిలో ఆయన కూడా ఒకరని వాదన ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రాజీనామా లేఖ హాట్ టాపిక్‌గా మారింది
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారం రాజీనామా
June 08, 2025
0
Tags