విశ్లేషకుడి ముసుగులో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర ఉంది !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అమరావతి మహిళలపై కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించారు. ''అమరావతిపై వ్యాఖ్యలతో మహిళలను అవమానించారు. అమరావతిలో విలసిల్లిన బౌద్ధాన్ని అవహేళన చేశారు. ఆ ప్రాంత చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను విస్మరించవద్దు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన వారిలో 32 శాతం ఎస్సీ, ఎస్టీలు, 14 శాతం బీసీలు ఉన్నారు. రాజధానిపై కుట్రలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు. విశ్లేషకుడి ముసుగులో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర ఉంది. ఇలాంటి కుట్రలను ప్రజలు, అధికార యంత్రాంగం లోతుగా విశ్లేషించాలి. రాజధానిని, అక్కడి మహిళలను అవమానించేందుకు కుటిల యత్నం'' అని పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)