తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరికొన్ని గంటల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబి మాజీ చీఫ్ మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇండియాలోకి అడుగుపెట్టబోతున్నాడు. రేపు సిట్ అధికారుల ఎదుట ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నాడు.. ట్రావెల్ పర్మిట్ కు సంబంధించిన పత్రాలు ప్రభాకర్ రావుకు అందిన మూడు రోజుల్లోగా విచారణ అధికారుల ఎదుట హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అమెరికాలో ట్రావెల్ కు సంబంధించిన పత్రాలు రెండు రోజుల క్రితం ప్రభాకర్ రావు అందుకోవడం జరిగింది ..పత్రాలు తీసుకున్న తర్వాత ప్రభాకర్ రావు అమెరికాలో విమానం ఎక్కాడు.. ఆ తర్వాత ఇవాళ రాత్రికి హైదరాబాదులో దిగిపోతున్నాడు. రేపు సిట్ ఎదుట హాజరు కాపుతున్నట్లు ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చాడు.. అయితే పోలీసుల ఎదుట హాజరై ప్రభాకర్ ఏమి చెప్పబోతున్నాడు అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది.. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి తో పాటు మాజీ అధికారుల పాత్ర గురించి ప్రభాకర్ రావు ఏమి చెప్తాడు అనేది ఇప్పుడు ఒక ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.. గత సాధారణ ఎన్నికలతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన మూడు ఇప్ప ఎన్నికల సందర్భంగా జరిగిన ఫోన్ సంభాషణల మీద ప్రధానంగా ప్రభాకర్ రావుని విచారించబోతున్నారు.. దీంతో పాటుగా అప్పటి ప్రత్యక్ష పార్టీ కాంగ్రెస్తోపాటు బిజెపి లకు ఆర్థిక సహాయం చేసిన వాళ్లపై నిగా పెట్టి ఆ డబ్బులను పట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.. హవాలా మార్గంలో డబ్బులను బదిలీ చేస్తున్న వారిని పట్టుకొని కేసులు నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు కొన్ని సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.. మరోవైపు అప్పటి అధికార పార్టీలో అసమతి స్వరం వినిపించిన నాయకులపై కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి.. మరొకవైపు హైకోర్టు జడ్జిలతో పాటు మీడియా చైర్మెన్లు జర్నలిస్టుల ఫోన్లను కూడా టాప్ చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో మేరకు ఈ విషయాలు బట్టబయలు అయినాయి.
రేపు సిట్ ఎదుట హాజరుకానున్న ప్రభాకర్ రావు
June 08, 2025
0
Tags