జూన్‌ 6 నుంచి 20 వరకు టాటా మోటర్స్‌ మాన్సూన్‌ చెకప్‌ క్యాంప్‌

Telugu Lo Computer
0


జూన్‌ 6న నుంచి 20 వరకు మాన్సూన్‌ చెకప్‌ క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్లు టాటా మోటర్స్‌ వెల్లడించింది. 500 నగరాల్లో 1,090 ఆథరైజ్డ్‌ వర్క్‌షాప్‌లలో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఈ క్యాంపులో భాగంగా వాహనంలోని ముప్ఫై కీలక పాయింట్లను పరీక్షించే సమగ్ర హెల్త్‌ చెకప్‌ సేవలు పొందవచ్చని వివరించింది. కార్‌ టాప్‌ వాష్, ఒరిజినల్‌ స్పేర్‌ పార్టులు, ఇంజిన్‌ ఆయిల్, యాక్సెసరీలు, లేబర్‌ చార్జీలపై ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చని టాటా మోటార్స్‌ తెలిపింది. దేశంలో టాటా మోటార్స్ ఇండియా కర్వ్, టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ, ఇటీవల లాంచ్ చేసిన టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ తో సహా ఏడు ఐసీఈ కార్లను అందిస్తోంది. అలాగే కర్వ్.ఈవీ, నెక్సాన్.ఈవీ, పంచ్.ఈవీ, టియాగో.ఈవీ, టిగోర్.ఈవీ, ఇటీవల లాంచ్ చేసిన టాటా హారియర్.ఈవీ వంటి ఆరు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా బ్రాండ్‌ జాబితాలో ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)