డీఆర్డీవో అభివృద్ధి చేస్తున్న ఈ క్షిపణి 8 వేల కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. ఇది భారత నావికా దళానికి కీలకంగా మారనుంది. ఇదొక సబ్ మెరీన్ లాంచ్డ్ బాలిస్టిక్ క్షిపణి. ఇండియాకు చెందిన సముద్ర ఆధారిత అణు వ్యూహానికి మూలస్థంభం కానుంది. కే 6 హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి 2017 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. త్వరలో పూర్తి కానుంది. భారతదేశ క్షిపణులకు చెందిన కే సిరీస్‌లో ఇది చాలా అత్యాధునికమైంది. ఇండో చైనా సముద్ర ఉపరితలంపై చైనా నుంచి ఎదురౌతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్షిపణి రూపుదిద్దుకుంటోంది. చైనా ప్రస్తుతం జేఎల్ -3 తో అమర్చిన టైప్ 094, టైప్ 096 లను సముద్రంలో మొహరిస్తోంది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఇండియా కే 6 క్షిపణి అభివృద్ధి చేస్తోంది. ఇది గంటకు 9,261 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. శత్రుదేశాలు స్పందించేలోగా దాడి చేస్తుంది. హిందూ మహాసముద్రంలోని సురక్షిత ప్రాంతాల నుంచే లక్ష్యాల్ని ఛేదించవచ్చు. ఈ క్షిపణిలో మూడు దశల ఘన ఇంధన వ్యవస్థ ఉంటుంది. పేలోడ్ సామర్ధ్యం 2-3 టన్నులు. 12 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇందులో మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటెబుల్ రీ ఎంట్రీ వెహికల్ టెక్నాలజీ ఉంటుంది. దాంతో విభిన్న లక్ష్యాలపై విభిన్న వార్‌హెడ్స్ పంపించగలదు. ఈ క్షిపణి పూర్తయితే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే దేశాల సరసన చేరుతుంది. త్వరలో రానున్న ఎస్ 5 అణు సబ్‌మెరీన్‌ల కోసం ప్రత్యేకం గా ఈ క్షిపణి తయారవుతోంది. ఈ సబ్‌మెరీన్లు 12-16 కే 6 క్షిపణుల్ని మొహరించగల సామర్ధ్యం కలిగి ఉంటాయి. కే 6 హైపర్ సోనిక్ క్షిపణి చైనాకు చెందిన జేఎల్ 2 ( 7 వేల కిలోమీటర్లు ) జేఎల్ 3 ( 9 వేల కిలోమీటర్లు) లకు దీటుగా ఉంటుంది. ఇప్పటికే 5-6 వేల కిలోమీటర్ల సామర్ధ్యం కలిగిన కే 4 క్షిపణి నావికా దళంలో ఉంది.
భారత నావికా దళానికి కీలకంగా మారనున్న హైపర్ సోనిక్ క్షిపణి
June 26, 2025
0
Tags