2019 నుంచి ఇప్పటి వరకు గడిచిన ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయని 345 గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలను గుర్తించి వాటిని డీలిస్ట్ చేసే ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఆయా పార్టీల కార్యాలయాలు కూడా ఎక్కడా లేవని ఈసీ గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పార్టీలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. ఎన్నికల సంఘం వద్ద సుమారు 2800కి పైగా గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలు ఉన్నాయి. సాధారణంగా ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లను లేదా నిర్దిష్ట సంఖ్యలో సీట్లను గెలుచుకోవాలి. మిగిలిన పార్టీలను నమోదిత గుర్తింపులేని పార్టీలుగానే పరిగణిస్తారు.
345 గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలను తొలగించాలని ఎన్నికల సంఘం నిర్ణయం ?
June 26, 2025
0
Tags