జగన్నాథుడి పుణ్యభూమికి వెళ్లడం నాకు ముఖ్యమని ట్రంప్‌ ఆహ్వానాన్ని తిరస్కరించా !

Telugu Lo Computer
0


డిశాలో ప్రధాని నరేంద్ర మోడీ రూ.18,600 కోట్ల విలువైన 105 ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ సుపరిపాలన, ప్రజాసేవలో ఒడిశాలోని భాజపా ప్రభుత్వం విజయవంతంగా ఒక ఏడాది పూర్తి చేసుకుందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వెల్లడించారు. ''జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్‌ ఫోన్‌ చేశారు. వాషింగ్టన్‌ మీదుగా వెళ్లాలని సూచించారు. విందులో పాల్గొని చర్చించుకుందామని పిలిచారు. జగన్నాథుడి పుణ్యభూమికి వెళ్లడం నాకు ముఖ్యమని చెప్పా. ఆయన ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించా''అని చెప్పారు. పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని తెరవాలన్న ప్రజల డిమాండ్‌ను భాజపా ప్రభుత్వం నెరవేర్చిందని మోడీ చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో భారత్‌లో సుపరిపాలనకు చోటు లేకపోయిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఒడిశా అవినీతి కేంద్రంగా నిలిచిందన్న ప్రధాని, మౌలిక సదుపాయాల కల్పనలో అప్పటి ప్రభుత్వం విఫలమైందన్నారు. చాలా ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయని, క్రమంగా వాటిని అభివృద్ధి చేసేందుకు భాజపా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఒడిశా పర్యటన అనంతరం ప్రధాని విశాఖకు రానున్నారు. రాత్రి అక్కడే బస చేసి, శనివారం ఉదయం ఆర్కే బీచ్‌లో నిర్వహించబోయే యోగా కార్యక్రమంలో పాల్గొననున్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)