మహిళా బోగీలో ప్రయాణిస్తున్న యువతుల మధ్య కోట్లాట జరిగింది. ఈ కొట్లాటలో మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు. ఈ దాడిలో పలువురికి రక్తం కూడా కారుతోంది. మరీ ప్రమాదకరంగా వారు రైలు డోర్ వద్ద తన్నుకోవడంతో ఓ మహిళ క్రింద పడిపోయేదే. దాన్ని చూసి మిగిలినవారు కేకలు పెట్టడంతో ఇవతలకి జరిగారు. ఈ గొడవ రైలు డోంబివ్లి నుంచి కల్యాణ్ స్టేషన్ల మధ్య జరిగినట్లు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగినట్లు మిడ్ డేలో పోస్ట్ పెట్టడంతో అది ఎప్పుడు జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మహిళా బోగీలో ప్రయాణిస్తున్న యువతుల మధ్య కోట్లాట : సోషల్ మీడియాలో వీడియో వైరల్
June 20, 2025
0
Tags