కొండా మురళి వ్యాఖ్యలపై నివేదిక కోరామని, డీసీసీ పరిశీలకుడి నుంచి నివేదిక వచ్చాక స్పందిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆయనకు సంబంధం లేని పంచాయతీ ఎన్నికలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడటం సరికాదని ఆయనకు సూచించినట్టు తెలిపారు. న్యాయస్థానంలో ఉన్న అంశంపై పొంగులేటి మాట్లాడటంపై తాను అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వివరించారు. పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు మాట్లాడిన మాటలే తప్ప వేరే ఉద్దేశం కాదని పొంగులేటి చెప్పినట్లు వివరించారు. న్యాయస్థానం తీర్పు తర్వాతనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయని పీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా తమ పరిధిలో లేని అంశాలను మాట్లాడవద్దని సూచించారు. ఇతరుల శాఖల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. విధానపరమైన అంశాల విషయంలో పార్టీపరంగా చర్చించి, మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్న అంశాలపై మాట్లాడితే ఎలాంటి అభ్యంతరం ఉండదని వివరించారు. అలా కాకుండా అంతర్గతంగా మాట్లాడుకున్న అంశాలను మీడియాతో మాట్లాడవద్దని మాత్రమే తాను చెప్పినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో తానే అభ్యర్థిని అని అజహరుద్దీన్ మాట్లాడటంలో తప్పు లేదన్న మహేశ్‌కుమార్‌గౌడ్, గతంలో పోటీ చేసినందున తిరిగి తననే పోటీలో నిలుపుతారన్న భావనతో చెప్పి ఉంటారని అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు అమలు చేయాలన్న కృతనిశ్చయంతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్లు వివరించారు.
కొండా మురళి వ్యాఖ్యలపై నివేదిక వచ్చాక స్పందిస్తా !
June 20, 2025
0
Tags