న్యూ సిటీ స్పోర్ట్‌ కారును విడుదల చేసిన హోండా కార్స్ ఇండియా

Telugu Lo Computer
0


హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఈరోజు 'న్యూ సిటీ స్పోర్ట్‌'ను విడుదల చేసింది. నలుపు రంగు యాక్సెంట్‌లతో స్పోర్టి ఎక్స్‌టీరియర్ స్టైలింగ్, కాంట్రాస్టింగ్ రెడ్ హైలైట్‌లతో, ప్రత్యేకమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. 'లైఫ్‌ ఈజ్‌ ఎ స్పోర్ట్‌' అనే ట్యాగ్‌లైన్‌తో సిటీ స్పోర్ట్‌ పరిమిత యూనిట్లలో సిటీ లైనప్‌లో కొత్త గ్రేడ్‌గా అందుబాటులో ఉంటుంది. ఈ కారు ప్రత్యేకతను కోరుకునే వారి కోసం రూపొందించారు. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లో రేడియంట్‌ రెడ్‌ మెటాలిక్‌, ప్లాటినం వైట్‌ పెర్ల్‌, మీటియొరాయిడ్‌ గ్రే మెటాలిక్‌ అనే మూడు రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 1.5 i-VTEC పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉన్న హోండా సిటీ స్పోర్ట్‌ CVT ధర రూ.14,88,900, ఎక్స్‌-షోరూం. పెర్ల్‌ కలర్‌ కారుపై అదనపు ధర వర్తిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)