ప్రైవేటు పాఠశాలలు వసూలు చేసే ఫీజులను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు. ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ బిల్ -2025ను ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చినట్లు చెప్పారు. ఏప్రిల్ 1, 2025 తేదీ నుంచి దీనిని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. '' ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ రోజు ఎంతో సంతోషాన్నిస్తుంది. ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రాష్ట్రపత్రి ఆమోదం కోసం పంపిస్తాం. అనంతరం ఓ దీనిని చట్టంగా రూపొందిస్తాం'' అని మంత్రి వెల్లడించారు.
ఢిల్లీ ప్రైవేటు పాఠశాల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ఆర్డినెన్స్
June 10, 2025
0
Tags