జాతీయ భద్రతా సలహా బోర్డు(ఎన్‌ఎస్‌ఏబీ) సభ్యుడిగా డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్ సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. నేటి నుంచి రెండేళ్లపాటు ఆయన ఎన్‌ఎస్‌ఏబీ సభ్యుడిగా కొనసాగనున్నారు. 'రా' చీఫ్ అలక్ జోషి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేసింది. ప్రధాని నేతృత్వంలో ఉన్న జాతీయ భద్రతా కౌన్సిల్‌కి ఈ బోర్డు సూచనలు చేయనుంది. బోర్డులో ఏడుగురు సభ్యులకు ఆరుగురిని ఇప్పటికే నియమించింది. వారిలో మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, ఆర్మీ సథరన్ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మోంటీ ఖన్నా, విశ్రాంత ఐపీఎస్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్‌సింగ్, మాజీ విదేశాంగ శాఖ అధికారి బి. వెంకటేశ్ వర్మ ఉన్నారు. తాజాగా రక్షణ రంగ నిపుణుడు సతీశ్‌రెడ్డికి బోర్డులో చోటు కల్పించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కూడా ఉన్నారు
జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడిగా సతీశ్‌రెడ్డి
June 10, 2025
0
Tags