నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు, నా రక్త సంబంధమే నాపై విష ప్రచారం చేసింది : వైఎస్ షర్మిల

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు మద్దతిస్తున్నారన్న మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ''రోజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రోజా, వైకాపా నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు. నా రక్త సంబంధమే నాపై విష ప్రచారం చేసింది. నేను వైఎస్సార్‌కే పుట్టలేదని ప్రచారం చేశారు. విజయమ్మకు నేను అక్రమ సంతానం అని ప్రచారం చేశారు. మీరు చేసిన అసభ్య వ్యాఖ్యలపట్ల నేను ఎంత బాధపడి ఉంటాను? అన్న కష్టాల్లో ఉన్నాడని అనగానే 3,200 కి.మీ పాదయాత్ర చేశా. రక్త సంబంధానికి విలువ ఇచ్చి పాదయాత్ర చేశా. మీరు మనుషులు కాదు. రక్త సంబంధంపై మాట్లాడేందుకు సిగ్గుండాలి. విజయమ్మను పార్టీ నుంచి వెళ్లగొట్టిన రోజే మీ పతనానికి నాంది పడింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కోరుతున్నా. రాష్ట్ర సమస్యలపై ప్రజా పోరాటాలకే నా మద్దతు ఉంటుంది'' అని షర్మిల తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)