గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో విమాన ప్రయాణికులతోపాటు, అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత వైద్య విద్యార్థులు, వైద్యుల కుటుంబాలను ఆదుకోవడానికి యుఏఈలో ఉండే భారతీయ డాక్టర్ షంషీర్ వాయాలిల్ సుమారు రూ. 6కోట్ల (2.5 మిలియన్ దిర్హామ్) సహాయాన్ని ప్రకటించారు. కేరళకు చెందిన వైద్యుడు బహుళజాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ , వీపీఎస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ వాయలిల్ మానవ్, ఆర్యన్, రాకేష్ , జైప్రకాష్‌లను "భవిష్యత్ ఫ్రంట్‌లైన్ హీరోలు" అంటూ వారికి నివాళి అర్పించారు. మెడికల్ హాస్టల్‌లో చదువుకున్న ఆయన వైద్య విద్యార్థుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. భోజనం చేస్తున్న సమయంలో హాస్టల్‌లో జరిగిన ప్రమాదంపై ఆయన తీవ్రంగా చలించిపోయారు. ఈ నేపథ్యంలో యువ వైద్యుల కుటుంబాలకు అండగా నిలబడానికి నిర్ణయించుకున్నారు. అబుదాబి నుంచే ఆయన ఈ సాయాన్ని ప్రకటించారు. దీన్ని మరణించిన నలుగురు విద్యార్థుల కుటుంబాలలో ఒక్కొక్కరికి రూ. కోటి, తీవ్రంగా గాయపడిన ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు, సన్నిహితులను కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు రూ. 20 లక్షల అందించనున్నారు. బీజే మెడికల్ కాలేజీలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా డాక్టర్ షంషీర్ ప్రకటించిన సాయం త్వరలోనే అందనుంది. ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలను చూసినప్పుడు తాను తీవ్రంగా కలత చెందారట. తాను హాస్ట్‌లో ఉంటూ చదువుతకుంటూ రోజులను తలచుకున్న ప్రమాద దృశ్యాలను చూసి చలించిపోయారట. వాయలిల్ తాను చదువుకునే రోజుల్లో మంగళూరు లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ, చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ హాస్టళ్లలో ఉన్నారట. స్వయంగా వాయలిల్ అల్లుడు, లులు గ్రూప్ ఇంటర్నేషనల్ యజమాని ఎంఏ యూసుఫ్ అలీ తెలిపారు. మరోవైపు బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కూడా అయిన వాయలిల్ తన దాతృత్వాన్ని చాటుకోవడం ఇదే మొదటి సారి కాదు 2010లో, మంగళూరు విమాన ప్రమాదం తర్వాత, బుర్జీల్ హోల్డింగ్స్‌లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలను కల్పించారు.
మరణించిన వైద్య విద్యార్థులు, వైద్యుల కుటుంబాలకు రూ.6 కోట్ల విరాళం ప్రకటించిన యూఏఈ భారతీయ వైద్యుడు షంషీర్ వాయాలిల్
June 17, 2025
0
Tags