ఢిల్లీ లోని సఫ్దర్‌గంజ్ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు అక్కడున్న 100 అడుగుల ఎత్తయిన మొబైల్ టవర్ కుప్పకూలింది. ఆదివారం తెల్లవారుజామున సరిగ్గా 4 గంటలకు ఈ ఘటన జరిగింది. అయితే మొబైల్ టవర్ కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. కాగా ఢిల్లీలో శనివారం రాత్రి కుంభవృష్టి కురిసింది. పెద్దఎత్తున ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి తెల్లవారుజామున టవర్ కూలిపోయింది.
ఢిల్లీలో ఈదురుగాలికి కుప్పకూలిన 100 అడుగుల మొబైల్ టవర్
June 15, 2025
0
Tags