కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ముగిసింది. రాష్ట్రంలోని వివిధ అంశాలపై సీఎం, కేంద్రమంత్రి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీ తగ్గింపుపై ఇరువురు నేతలు చర్చించారు. పొగాకు ధరలు తగ్గ్గినందున రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సీఎం వివరించారు. పొగాకు కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు ఖర్చు చేస్తోందని, టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలన్నారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్‌ను టొబాకో బోర్డు నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎంతో భేటీ అంనతరం పీయూష్ గోయల్ గుంటూరు వెళ్లారు. గుంటూరు పొగాకుబోర్డు కార్యాలయంలో అధికారులు, ఎన్‌ఐసీడీసీతో సమావేశం నిర్వహించనున్నారు. పొగాకు కొనుగోళ్లు, రైతుల సమస్యలపై చర్చించనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ
June 15, 2025
0
Tags