తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. సల్మా, సీనియర్ అడ్వొకేట్ పీ విల్సన్, ఎస్ ఆర్ శివలింగం ఈ జాబితాలో ఉన్నారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ సారథ్యాన్ని వహిస్తోన్న మక్కల్ నీథి మయ్యం పార్టీకి ఓ సీటును రిజర్వ్ చేసింది. తమిళనాడులో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీనితో పాటు అస్సాంలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే షెడ్యూల్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన మొత్తం ఎనిమిది రాజ్యసభ సీట్ల కోసం జూన్ 19వ తేదీన పోలింగ్ ను నిర్వహించాల్సి ఉంది. పీఎంకే- అన్బుమణి రామదాస్, ఏఐఏడీఎంకే- ఎన్ చంద్రశేఖరన్, డీఎంకే- ఎం షణ్ముగం, సీనియర్ అడ్వొకేట్ పీ విల్సన్, ఎంఎం అబ్దుల్లా, ఎండీఎంకే- వైగో సభ్యత్వ కాలం జులైలో ముగియబోతోంది. అస్సాంకు సంబంధించి.. భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు- బీరేంద్ర ప్రసాద్ భైష్య, మిషన్ రంజన్ దాస్ మాజీలు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలకు ఎన్నికలు అవసరం అయ్యాయి. ఈ ఎన్నిలకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 2వ తేదీన విడుదల అవుతుంది. అదే నెల 9వ తేదీన నామినేషన్ పర్వం ఆరంభమౌతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి ఈసీ నిర్దేశించిన చివరి తేదీ 12. 19వ తేదీన పోలింగ్ ఉంటుంది.
తమిళనాడు నుంచి రాజ్యసభకు కమల్ హాసన్
May 28, 2025
0
Tags