ఛత్తీస్‌గఢ్‌ టెన్త్‌లో స్టేట్‌ టాపర్‌ విద్యార్థిని ఇషికా బాలాకి బ్లడ్‌క్యాన్సర్‌

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌ పదో తరగతి పరీక్షల ఫలితాల్లో స్టేట్‌ టాపర్‌గా నిలిచిన ఇషికా బాలా అనే విద్యార్థిని బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నా చదువులో ఆమె వెనకడుగు వేయలేదు. ఇషిక చికిత్స కోసం ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కుటుంబసభ్యులు కోరుతున్నారు. కాంకేర్‌ జిల్లాకు చెందిన ఇషికా బ్లడ్‌ క్యాన్సర్‌తో ఒక ఏడాదిపాటు చదువుకు దూరమైంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మళ్లీ చదువు మొదలుపెట్టి ఛత్తీస్‌గఢ్‌ సెకండరీ బోర్డు పరీక్షల్లో 99.17 శాతం మార్కులు సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలిచింది. ఐఏఎస్‌ కావాలన్నది తన కలగా ఈ చదువుల తల్లి చెబుతోంది. సామాన్య రైతు అయిన ఇషిక తండ్రి శంకర్‌ ఆమె చికిత్స కోసం ఇప్పటికే రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సహాయత యోజన కింద ఇషిక ఆరోగ్యం మెరుగుపడటానికి అవసరమైన సహాయం అందేలా చూస్తామని జిల్లా విద్యాశాఖాధికారి అశోక్‌ కుమార్‌ పటేల్‌ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)