పాకిస్తాన్ కాల్పుల్లో బిఎస్‌ఎఫ్ ఎస్‌ఐ మహ్మద్ ఇంతియాజ్ వీరమరణం

Telugu Lo Computer
0


మ్మూ కాశ్మీర్‌లోని పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన క్రాస్ కాల్పుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్)కి చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ అమరులయ్యారు. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ ట్వీట్ ద్వారా ధృవీకరించింది. షెల్లింగ్‌లో మహ్మద్ ఇంతియాజ్ గాయపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి అమరులైనట్లు తెలుస్తోంది. "మే 10, 2025న జమ్మూ జిల్లా ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు కాల్పుల సమయంలో దేశ సేవలో బీఎస్‌ఎఫ్‌కు చెందిన ధైర్యవంతుడు సబ్-ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ చేసిన అత్యున్నత త్యాగానికి మేము సెల్యూట్ చేస్తున్నాం. బీఎస్‌ఎఫ్ సరిహద్దు పోస్టుకు నాయకత్వం వహిస్తూ, ముందు వరుసలో ధైర్యంగా నాయకత్వం వహించారు" అని బీఎస్‌ఎఫ్ ట్వీట్‌లో పేర్కొంది. బీఎస్‌ఎఫ్  కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఆదివారం జమ్మూ పలౌరాలోని ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో పూర్తి గౌరవాలతో పుష్పగుచ్ఛాల కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. శనివారం జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్ జవాను అమరవీరుడయ్యారు. మరో ఏడుగురు గాయపడ్డట్లు సమాచారం. ఈ సంఘటన ఆర్ఎస్ పురా సెక్టార్‌లో జరిగిందని అధికారులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)