భారత్‌తో ఉన్న వాణిజ్య సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటాం : బంగ్లాదేశ్

Telugu Lo Computer
0


భారత్‌తో నెలకొన్న వాణిజ్య సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటామని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌ అన్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ వాణిజ్య సలహాదారు షేక్‌ బషీరుద్దీన్‌ మీడియాతో వెల్లడించారు. అయితే, భారత్‌ తీసుకున్న చర్యలకు సంబంధించి మాకు ఇంకా అధికారిక సమాచారం రాలేదని బంగ్లా వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ తెలిపారు. సమాచారం అందిన తర్వాత చర్యలు తీసుకుంటాం అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే చర్చలతో వాటిని పరిష్కరించుకునేలా ప్లాన్ చేస్తామన్నారు. అఖౌరా, డాగి పోర్టులతో పాటు కొన్ని సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి పలు నిర్ణయాలను భారత్‌ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇది రెండు దేశాలకు మంచి విషయం.. వస్త్ర పరిశ్రమలో భారత్‌ మొదటి స్థానంలో ఉందని తాము భావిస్తున్నాం.. ఇప్పటికీ, ఆయా ఉత్పత్తులు మా దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. భారత్‌- బంగ్లాదేశ్ పొరుగు దేశాలు. సహజంగానే వాణిజ్యం, రవాణా లాంటి వాటిల్లో పోటీ అనేది ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సార్లు మేము ఆంక్షలు విధిస్తాం.. అలాగే భారత్ కూడా చేస్తోంది.. వాణిజ్య ప్రక్రియలో ఇది భాగం మాత్రమేనని తేల్చి చెప్పారు. ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే రెండు దేశాలు పరిష్కారం చేసుకుంటాయని బషీరుద్దీన్‌ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)