పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి వెల్లడించారు. పాక్ దాడుల యత్నాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టామని కూడా ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పైన దాడులు చేయడానికి పాకిస్తాన్ తెగబడుతుందని భారత సైన్యం ముందే అంచనా వేసింది. మిలట్రీ ని టార్గెట్ చేయడంతో పాటుగా పౌరులకు సంబంధించిన సదుపాయాలు, మతపరమైన ప్రాంతాల పైన టార్గెట్ చేసే అవకాశం ఉందని భావించారు. పాకిస్తాన్ కు ఎటువంటి ఖచ్చితమైన లక్ష్యాలు లేవని, ఎక్కడ సాధ్యమైతే అక్కడ విధ్వంసం సృష్టించి భారత పౌరులకు నష్టం చేసే ప్లాన్ చేసిందని భావించారు. ఇక ఈ క్రమంలోనే పాకిస్తాన్ గోల్డెన్ టెంపుల్ ను టార్గెట్ చేసిందని గుర్తించారు. ఈ క్రమంలో గోల్డెన్ టెంపుల్ కు ఎటువంటి హాని జరగకుండా అదనపు రక్షణ కల్పించినట్టు గా, గోల్డెన్ టెంపుల్ రక్షించడం కోసం పూర్తిగా సిద్ధమైనట్లుగా ఆయన పేర్కొన్నారు. మన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ పాకిస్తాన్ సైన్యం ప్రణాళికలను తిప్పి కొట్టిందని మేజర్ జనరల్ వెల్లడించారు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్ , క్షిపణులను ఎక్కడికక్కడ ధ్వంసం చేశామని స్వర్ణ దేవాలయం పైన ఒక గీత కూడా పడకుండా కాపాడగలిగాము అని తెలిపారు.
స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్ !
May 19, 2025
0
Tags