అఖిలపక్షం నుంచి తప్పుకున్న యూసఫ్‌ పఠాన్‌ !

Telugu Lo Computer
0


మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్‌ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఉద్దేశించిన ఏడు బృందాలు విదేశాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ యూసఫ్‌ పఠాన్‌ తప్పుకున్నారు. తమను సంప్రదించకుండానే పఠాన్‌ ఎంపిక జరిగిందంటూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ కేంద్రంపై విమర్శలు చేశారు. పాక్‌ను ఎండగట్టే దౌత్యబృందంలో కేంద్రం అన్ని పార్టీల సభ్యులకు చోటు కల్పించింది. అందులో టీఎంసీ పార్టీ నుంచి బహంపుర్‌కు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న యూసఫ్‌ పఠాన్‌ను ఎంపిక చేసింది. అయితే, ఈ ఎంపికను టీఎంసీ తప్పుబట్టింది. తమను సంప్రదించకుండా పఠాన్‌ను దౌత్యబృందంలో చేర్చడం సమంజసం కాదని అభిషేక్‌ బెనర్జీ పేర్కొన్నారు. ఒక పార్టీ ఎంపీని ఎంపిక చేసేటప్పుడు ఆ పార్టీతో సంప్రదింపులు జరపాలని కేంద్రానికి సూచించారు. అంతేకాక.. కేంద్రం నిర్ణయించిన దౌత్య బృందం పర్యటనకు పఠాన్‌ వెళ్లడం లేదని స్పష్టంచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)