ఉగ్రవాదంపై పోరుపై భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌

Telugu Lo Computer
0


గ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌, దానిని మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లేందుకు అఖిలపక్ష బృందాలను మన ప్రభుత్వం విదేశాలకు పంపించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, జపాన్‌కు వెళ్లిన బృందాలు పాకిస్తాన్‌ దుశ్చర్యలు, భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై ఆయా దేశాల నాయకులకు వివరించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో వారి నుంచి భారత్‌కు పూర్తి మద్దతు లభిస్తున్నట్లు అక్కడున్న మన రాయబార కార్యాలయాలు వెల్లడిస్తున్నాయి. శివసేన ఎంపీ శ్రీకాంత్‌ శిందే నేతృత్వంలోని అఖిలపక్ష బృందం యూఏఈలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో అక్కడి మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ప్రముఖులు, మేధావులతో భేటీ అవుతోంది. ఇప్పటికే రెండు కీలక సమావేశాల్లో పాల్గొంది. ఈ సందర్భంగా పాక్‌ నుంచి ఎదురవుతున్న ఉగ్ర ముప్పు, ఆపరేషన్‌ సిందూర్‌ వంటి చర్యలను వారికి మన బృందం వివరించింది. ఈ క్రమంలో భారత్‌ చేపట్టిన దౌత్యపరమైన కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించిన యూఏఈ అధికారులు.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా రూపుమాపాల్సిందేనని ఉద్ఘాటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)