దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే విపరీతంగా లాభాల బాట పట్టాయి. నాలుగు రోజులపాటు సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర కాల్పులు, ఉగ్రదాడుల తర్వాత కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం, పెట్టుబడిదారులలో కొత్త నమ్మకాన్ని కలిగించింది. ఉదయం 10:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 2254.45 పాయింట్లు పెరిగి 81,708.92 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 694.65 పాయింట్ల లాభంతో 24,702.65 వద్ద ట్రేడ్ అయింది. ఈ భారీ ర్యాలీతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. నాలుగు రోజుల పాటు సరిహద్దుల్లో కొనసాగిన తీవ్ర కాల్పుల అనంతరం కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందం పాకిస్థాన్ ప్రధాన స్టాక్ సూచీపై కూడా సానుకూల ప్రభావం చూపింది. అక్కడి మార్కెట్ సోమవారం ప్రారంభంలోనే 9 శాతానికి పైగా లాభపడింది. బ్యాంకింగ్, ఐటీ, ఎనర్జీ, పోర్ట్స్ రంగాల్లోని దిగ్గజ సంస్థల షేర్లు భారీగా లాభపడినవి. అదానీ గ్రూప్ సంస్థల షేర్లు 5% వరకు పెరగగా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కీలక కంపెనీలు 3-4% మధ్య లాభాలతో ట్రేడ్ అయ్యాయి.
లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్
May 12, 2025
0
Tags