ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయ రాజా భారత రక్షణ శాఖకు తన ఒకరోజు పారితోషికాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఇళయరాజా తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. 'పహల్గామ్‌లో మన దేశ పర్యాటకులపై ఉగ్రమూక దాడి చేసింది. దీనికి మన దేశ సైనికులు తప్పక ప్రతీకారం తీర్చుకోవాలి. వారి ధైర్య సాహసాలు అభినందనీయం. మన సైనికులు ఆత్మస్థైర్యంతో వారిని మట్టు పెడతారనే నమ్మకం నాకు ఉంది. దేశ పౌరుడిగా, ఎంపీగా నా ఒకరోజు పారితోషికాన్ని దేశ రక్షణ శాఖకు విరాళంగా ప్రకటిస్తున్నాను' అని ఆయన పేర్కొన్నారు.
భారత రక్షణ శాఖకు ఒకరోజు పారితోషికాన్ని విరాళంగా ప్రకటించిన ఇళయ రాజా
May 12, 2025
0
Tags