తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు !

Telugu Lo Computer
0


తెలంగాణలో ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులు వానలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సోమవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగులు వీస్తాయని పిడుగులతో కూడిన వానపడే అవకాశం ఉందంటూ ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని తెలిపింది. ఇక బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ హైదరాబాద్‌ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్‌, వికారాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అలాగే, పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని హెచ్చరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)