వీధి వ్యాపారులకు క్రెడిట్‌ కార్డులు ?

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం 2020 జూన్‌లో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వనిధి యోజన)నుఅధిక వడ్డీ రుణాల భారం నుంచి వీధి వ్యాపారులకు విముక్తి కల్పించేందుకు ప్రవేశపెట్టింది. పురపాలక సంఘాల్లో గుర్తించిన వీధి వ్యాపారులకు ఇప్పటి వరకు మూడు విడతల్లో తక్కువ వడ్డీతో స్వల్పకాలిక రుణాలు ఇచ్చింది. ఈ రుణాల ప్రక్రియను నిలిపివేసిన కేంద్రం గతేడాది డిసెంబరులో ఆ వెబ్‌సైట్‌ను కూడా మూసివేసింది. వీధి విక్రయ వ్యాపారుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో వారికి ఆత్మనిర్భర్‌ నిధి కింద ఇకపై క్రెడిట్‌ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ నిధి యోజనను కేంద్రం పట్టణాల్లో అమలు చేసింది. ఎంపిక చేసిన వీధి వ్యాపారులకు తొలి విడతలో రూ.10 వేలు, రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50 వేల చొప్పున రుణాలు ఇచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)