కర్ణాటకలోని విజయపుర జిల్లా బసవనబాగేవాడి తాలూకా మనగోళి సమీపంలో బుధవారం ఉదయం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవగా అందులో నలుగురు గద్వాల జిల్లాకు చెందినవారు ఉన్నారు. గద్వాలకు చెందిన టి.భాస్కర్ (40) తొలుత గద్వాల కెనరా బ్యాంకులో విధులు నిర్వర్తించి మేనేజర్‌గా కర్ణాటకలోని విజయపురకు వెళ్లారు. తాజాగా ఆయనకు హైదరాబాద్ బ్రాంచీకి బదిలీ కావడంతో కుటుంబంతో దైవ దర్శనానికి బుధవారం మురుడేశ్వర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సోలాపుర - చిత్రదుర్గ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 50)పై తొలుత ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ ఆ తర్వాత భాస్కర్ వాళ్లు ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. భాస్కర్‌తోపాటు ఆయన భార్య పవిత్ర (35), కుమార్తె జ్యోత్స్న(12), కుమారుడు అభిరామ్(14), కారు డ్రైవర్, విజయపుర జిల్లా హొర్తికి చెందిన వికాశ శివప్ప మకని, ట్రావెల్స్ బస్సు డ్రైవర్ బసవరాజ రాథోడ్ ప్రమాద స్థలంలోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన భాస్కర్ మరో కుమారుడు ప్రవీణ్ తేజ, లారీ డ్రైవర్ చెన్నబసు సిద్ధప్పలను విజయపుర జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు.
ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురి దుర్మరణం
May 22, 2025
0
Tags