ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐటీసీ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలను కిందుకు లాగుతున్నాయి. దీంతో ప్రారంభంలోనే 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ క్రమంగా నష్టాల్లోకి జారుకుంటోంది. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 678 పాయింట్ల నష్టంతో 80,918 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 207 పాయింట్ల నష్టంతో 24,605 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో.. టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ మాత్రమే లాభాల్లో కదలాడుతున్నాయి.
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
May 22, 2025
0
Tags