కాంగ్రెస్ పార్టీ నిందలు, దందాలు, చందాలు అని పని చేస్తుంది : కేటీఆర్

Telugu Lo Computer
0


తెలంగాణలోని గద్వాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మన పార్టీ నుంచి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో పండబెట్టి తొక్కే విదంగా ఓడించాలి. మీ ఆవేశం చూస్తుంటే రాబోయే గద్వాల ఉప ఎన్నికల్లో మనం సామాన్య వ్యక్తిని పెట్టినా గెలుస్తాం అన్నారు. ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ ఇచ్చిన అభయ హస్తం హామీ అని ఎద్దేవా చేశారు. ఎన్ని రోజులు చూడాలి ఈ కాంగ్రెస్ దరిద్రాన్ని అని అందరూ అడుగుతున్నారు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గతంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని మనం పని చేస్తే కాంగ్రెస్ పార్టీ నిందలు, దందాలు, చందాలు అని పని చేస్తుంది అని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి మీద అనుమానం కలుగుతుంది అని పేర్కొన్నారు. అప్పులు పుట్టట్లేదు అంటాడు ఆయనే లక్ష యాభై కోట్ల అప్పు చేసిన అంటాడు.. మరో మూడేండ్లు ఈ దరిద్రం అనుభవించాల్సిందే.. రాబోయే ఏ ఎన్నికలు అయినా కారు గుర్తును గెలిపించాల్సిందే అని కోరారు. కేసీఆర్ ముందే చెప్పినా మనం మోసపోయాం.. జూన్ లో మెంబర్షిప్ ప్రారంభం చేసుకుందాం. గ్రామ స్థాయి నుంచి పార్టీని డెవలప్ చేసుకుందాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)