బెంగళూరులో టెక్ కంపెనీలో పని చేసే యువతి ఊబెర్‌లో క్యాబ్ బుక్ చేసుకుంది. అయితే, డ్రైవర్‌ను చూశాక మాత్రం భారీ షాక్‌కు గురయ్యింది. కారణం అతడు ఆమె బాసే. తనకంటే ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా క్యాబ్ నడపడం ఏంటో ఆమెకు అర్థం కాలేదు. తాను క్యాబ్ నడుపుతోంది డబ్బుల కోసం కాదని తన బాస్ చెప్పినట్టు ఆమె తెలిపింది. రోజువారీ ఆఫీసు పనులతో తాను విసిగిపోతున్నానని, కాస్త డిఫరెంట్‌గా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇలా క్యాబ్ నడుపుతున్నానని బాస్ చెప్పినట్టు యువతి పేర్కొంది. బోర్ కొడుతున్నట్టు ఉండటంతో ఇలా వెరైటీ వ్యాపకాన్ని ఎంచుకున్నానని బాస్ చెప్పినట్టు వెల్లడించింది. ఇక ఈ పోస్టుపై సహజంగానే నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బెంగళూరులో లైఫ్ ఇలాగే ఉంటుందని కొందరు కామెంట్ చేశారు. అనేక మంది టెకీలు రోజూ చేసే పని బోర్ కొట్టడంతో ఇలాంటి సరదా పనులు అనేకం చేస్తుంటారని అన్నారు. ఇలా రెండు పనులను సులువుగా నేర్పుగా చక్కబెట్టేస్తుంటారని, బెంగళూరు స్టార్టప్ కల్చర్‌కు ఇది నిదర్శనమని కామెంట్ చేశారు. కొందరు మాత్రం ఈ వివరణలపై సందేహం వ్యక్తం చేశారు. ఆర్థిక అవసరాల కోసమే ఆమె బాస్ డ్రైవర్‌గా మారి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వాహనాల రద్దీ బీభత్సంగా ఉండే బెంగళూరు లాంటి నగరాల్లో టైమ్ పాస్ కోసం డ్రైవింగ్ చేయాలని ఎవరైనా కోరుకుంటారా అని ప్రశ్నించారు. కేవలం సరదా కోసం బాస్ డ్రైవర్‌గా మారాడంటే నమ్మశక్యం కాదని స్పష్టం చేశారు. ఆర్థిక ఒడిదుడుకులే అతడిని ఇలాంటి పనికి పురిగొల్పి ఉంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి దృశ్యాలు బెంగళూరుకే పరిమితం కాదని కొందరు అన్నారు. ఇతర మెట్రో నగరాల్లో ఈ తరహా ఉదంతాలు వెలుగు చూశాయని చెప్పుకొచ్చారు.
డ్రైవర్‌గా తన బాస్ రావడంతో ఖంగుతిన్న క్యాబ్ బుక్ చేసిన యువతి !
May 26, 2025
0
Tags